ఆధ్యాత్మిక గురువులైన శ్రీ జె.పి.వాస్వాని గారి అనేక వ్యాసాలను
సంగ్రహించి ఒక పుస్తక రూపంలో ఆంగ్లంలో ‘Finding Peace of
Mind’ అని ప్రచురించడం జరిగింది.
దానికి తెలుగు అనువాదమే ఈ ‘శాంతి పొందడం ఎలా’. మాతృభాషలో చదివే వారికి ఇది ఒక అవకాశమని చెప్పాలి. ఎందుకంటే ఇందులో నున్న విషయం ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోదగినవి. చాల గంభీరమైన ఆధ్యాత్మిక విషయాలను గురువుగారు చాల సులభంగా వివరించారు.
ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో సంభవించే సమస్యలకు, పరిస్థితులకు సులభమైన మార్గోపాయలను సూచించడం జరిగింది. అందువలనే ఇది ప్రతి ఒక్కరికి అత్యవశ్యకమని భావిస్తున్నాము. నిజజీవితంలో మనం ఎలా మెలగాలి.
మన తోటి మనుష్యులతో, తోటి జంతువులతో ప్రాణులతో ఎలా జీవించాలి అని చాల చక్కగా ఉదాహరణాలతో వివరించడం జరిగింది.
అలాగే మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని గూర్చి కూడా వివరంగా వివరించారు గురువుగారు. ప్రతి దినం మన జీవితంలో సంభవించే అనేక సంఘటనలు, సమస్యలను అధిగమించి మనమెలా సంతోషంగా, శాంతిగా జీవించగలమో ఈ పుస్తకము వివరిస్తుంది.
ఈ దైనందిన జీవితానికి కర్మ సిద్ధాంతాన్ని అన్వయించి, ప్రార్థనా సరళని వివరించి, ధ్యానం యొక్క ఆవశ్యకతను తెలియజేసి, మరణాన్ని కూడా అర్ధవంతంగా, వాస్తవిక దృష్టితో వివరించారు శ్రీ వాస్వాని గారు. ప్రతి యొక్కరూ తప్పక చదువవలసిన పుస్తకమిది.