మనం ఒక్కొక్క సంగతి చెప్పడానికి ఒక్కొక్క భాష ఒక్కొక్క స్వరం ఒక్కొక్క అభినయ వైఖరి వాడుతున్నాం. సరదా సంగతికి ఒక ధోరణి, దు:ఖానికి మరొక రకం, కోపానికి ఇఒకో విధం… అలాగే సంగీతంలో సాహిత్య భావాన్ని బట్టీ గానం చేసే సమయ సందర్భాలను బట్టీ రాగాలు స్వర ప్రసారాలూ మారుతాయి.
అలాగే రకరకాల పరిస్థితులను ప్రతిబింబించే చిత్రాలు మాత్రం ఎందుకు మారకూడదు! అంతేకాదు – చిత్రకారులలో మన దేశంలో, మన రాష్ట్రంలో, ఈ నగరంలో – ఇతర దేశాలలో ఎందరో చిత్రకారులు, మహానుభావులున్నారు. వారందరూ నా గురువులే – అందరి దగ్గరా నేను ఎన్నో నేర్చుకున్నాను. నేర్చుకుంటూనే వున్నాను. నేను ఒకో ఆర్టిస్టు బొమ్మ చూస్తూంటే ఆయనలా వేయాలనిపిస్తుంది. అలాటి ‘ఆయనలు’ నాకు శతకోటి ఉండబట్టి నేను ఏ శైలికీ కట్టుబడలేను. ఏ శైలీ నాకు కట్టుబడి ఉండదు’ అంటాడు…
- Weight : 175gms
- Breadth : 13.6cm
- Length : 21.5cm
- Height : 1cm