18 నెలల వయస్సులో సోకిన ఒక విషజ్వరం మూలాన వినికిడి శక్తి, చూపు కోల్పోయిన హెలెన్
కెల్లర్ జీవితం గురించి ఆంగ్లంలో ఎన్నో పుస్తకాలు అచ్చుప్రతులుగాను, అంతర్జాలంలోను అందుబాటులో ఉన్నాయి. కష్టాలనుఎదుర్కోవడంలో మనం దరికీ ఉండాల్సిన విశ్వాసం, ఆత్మస్థైర్యం, ఆశావాదాలకి ఆమె జీవితం ఒక ప్రతీక. బధిరత్వం/దృష్టిలోపం ఉన్నప్పటికీ కాలేజీ
డిగ్రీ సంపాదించిన మొట్టమొదటి వ్యక్తి హెలెన్ కెల్లర్. ఆమె చదువు గురించిన వివరాలను ఆమెలాంటి ఇతర బధిరత్వం / దృష్టి లోపం కలవారు చదవడానికి, ఇతరులతో సభాషించడానికి
ఉపయోగించిన పద్ధతుల వివరాలు ఈ తెలుగుఅనువాదం మన ముందుకు తెస్తOది. జీవితం గురించి, చదువు గురించి 100 సంవత్సరాల ముందు ఆమెకున్న అభిప్రాయాలు ఇప్పటికి అర్ధవంతమైనవని కింద పేర్కొన్న ఆమె quotations విశదీకరిస్తాయి:
ఎప్పుడూ తల వంచవద్దు. ప్రపంచం వైపు ఎల్లప్పుడూ తల ఎత్తిపెట్టి నిటారుగా చూడటం నేర్చుకో.
శస్త్రచికిత్స చేసే వైద్యుడు తనకు కావాల్సిన నైపుణ్యాన్ని పుస్తకాలు చదవడం ద్వారా ఎలా పొందడో అలాగే అర్ధవంతమైన జ్ఞానాన్ని మనం పాఠ్య పుస్తకాలనుండి నేర్చుకోలేం.
పంచంలో ఆనందం మాత్రమే ఉంటే, కష్టతరమైన పనులు మనం ధైర్యంగా, సహనంగాఎలా నేర్చుకొంటాం?
ఆశావాదం మన గాఢవిశ్వాసం అయినప్పుడు మనం దేనినైనా సాధించకల్గుతాం. ఆశ, ఆత్మస్థైర్యం లేకపోతే దేనినీ సాధించలేం.
మన విజయాలకు, ఆనందాలకు మనమే కారకులం అని గ్రహించినప్పుడు కష్టాలను ఎదుర్కొని నిలబడగలిగే శక్తి మనకు సులభంగా వస్తుంది.
ఇతరుల కష్టాలను కొంతవరకు తగ్గించి వారికి కొంచెం ఆనందం, నీ జీవితం వృధా కాదు.
విద్య ద్వారా పిల్లల్లో సొంత మేధోశక్తిని పెంపొందించాలి. దాని ద్వారా ప్రపంచంలో వారు కోరుకొనే స్థానాన్ని ఏర్పరుచు కొని, తమ హక్కుల్ని కాపాడుకోగలిగే సామర్ధ్యాన్ని కల్గించాల